Skip to main content

Namaste NRI

దసరా కానుకగా పొట్టేల్‌

యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం పొట్టేల్‌. సాహిత్‌ మోత్కూ రి దర్శకుడు. నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేశ్‌ కుమార్‌ సడిగే నిర్మాత. దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటున్నది. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్లతో పాటు ఓ పాప, పొట్టేల్‌ వీరి నేపథ్యంలో జాతీయ జెండా. పోస్టర్‌ స్ఫూర్తిదాయకం గా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్‌, ప్రియాంకశర్మ, తనస్విచౌదరి, నోయల్‌ సీన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మోనిష్‌ భూపతిరాజ్‌, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: నిసా ఎంటర్‌టైన్మెంట్స్‌, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News