![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Mayfair-118.jpg)
దర్శకుడు నితీశ్ తివారి రామాయణం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ రామాయణ కథలో నటించనున్నారట. అందులో రాముడిగా రణబీర్‌కపూర్ నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో ఉన్నారట నితీష్ తివారి. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకోసం ప్రభాస్‌ని కలిశారట నితీశ్ తివారి. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. రాముడిగా రణబీర్‌కపూర్ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్ భావించారట. దాంతో ఆయన ప్రభాస్‌ని కలిశారట. ప్రభాస్ కూడా పరశురాముడిగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన నిజానిజాలు ఇంకొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Ixora-117.png)