Skip to main content

Namaste NRI

రామాయణంలో పరశురాముడిగా ప్రభాస్‌?

దర్శకుడు నితీశ్‌ తివారి రామాయణం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ రామాయణ కథలో నటించనున్నారట. అందులో రాముడిగా రణబీర్‌కపూర్‌ నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో ఉన్నారట నితీష్‌ తివారి. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకోసం ప్రభాస్‌ని కలిశారట నితీశ్‌ తివారి. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. రాముడిగా రణబీర్‌కపూర్‌ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్‌ భావించారట. దాంతో ఆయన ప్రభాస్‌ని కలిశారట. ప్రభాస్‌ కూడా పరశురాముడిగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన నిజానిజాలు ఇంకొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.

Social Share Spread Message

Latest News