ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న సినిమా ఆదిపురుష్. పాన్ ఇండియా మూవీగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నదీ చిత్రం. కృతి సనన్ సీతాగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. రామాయణ గాథ నేపథ్యంలో దర్శకుడు ఓంరావత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చెడుపై పోరాటానికి సిద్ధమైన రాఘవుడు ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టినట్టు ఈ పోస్టర్ ఉంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు దసరా నవరాత్రుల్లో భాగంగా షురూ అవుతున్నాయి. అక్టోబర్ 2న అయోధ్యలో టీజర్‌ని విడుదల చేయనున్నారు. టీ సిరీస్, రైట్రోఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నుంచి వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమవుతున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. త్రీడీతో పాటు, ఐమాక్స్ ఫార్మేట్లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించ నుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)