నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నియమితులయ్యారు. రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఆయనతో ప్రమాణం చేయించారు. డిసెంబర్ 25న ప్రచండ నియామకాన్ని ప్రకటించగా, మూడోసారి నేపాల్ ప్రధాని పీఠం అధిష్టించారు. తొలిసారిగా 2008 నుంచి 2009 వరకు, రెండోసారి 2016 నుంచి 2017 వరకు ప్రధానిగా ఉన్నారు. మాజీ ప్రధాని, కమ్యూనిస్టు నాయకుడు కేపీ శర్మ ఓలీతో సహా మరో 5 సంకీర్ణ పార్టీలతో కలిసి ప్రచండ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీరి మధ్య ఒప్పందం కుదిరింది. రొటేషన్ ప్రకారం మొదటి రెండున్నరేండ్లు ప్రచండ ప్రధానిగా ఉండగా.. తదుపరి రెండున్నేండ్లు కేపీ శర్మ ఓలి మరోసారి ప్రధాని అవుతారన్నమాట.