Skip to main content

Namaste NRI

ప్రణం దేవరాజ్ కొత్త చిత్రం ప్రారంభం

ప్రణం దేవరాజ్‌ ప్రధాన పాత్రలో ఓ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ రూపొందుతున్నది. శంకర్‌ దర్శకత్వంలో పి.హరికృష్ణగౌడ్‌ దీన్ని నిర్మిస్తున్నారు. హరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకా లంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆకాశ్‌ పూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా, దేవరాజ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. తనికెళ్ల భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ అందించడం ద్వారా తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా. విలేజ్‌ బ్యాక్‌ట్రాప్‌లో ఉండే ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్‌, తర్వాత వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతుంది అని చెప్పారు. తమ ఈ మొదటి ప్రొడక్షన్‌ను ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు అని నిర్మాతలు అన్నారు. శేఖర్‌ చంద్ర మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రం నటీనటులు: ప్రణం దేవరాజ్‌, సుమన్‌, రవి శివతేజ; రచన దర్శకత్వం: శంకర్‌; నిర్మాత: పి.హరికృష్ణగౌడ్‌; డీపీవో: బాలసరస్వతి.

Social Share Spread Message

Latest News