Namaste NRI

సంగీత దిగ్గజం కోటి చేతుల మీదుగా ప్రణయ గోదారి సాంగ్ విడుదల

సదన్‌, ప్రియాంక ప్రసాద్‌ జంటగా నటిస్తున్న చిత్రం ప్రణయ గోదారి. పీఎల్‌ విఘ్నేష్‌ దర్శకుడు. పీఎల్‌వి క్రియేషన్స్‌ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలో కలలో.. కలలో అంటూ సాగే ప్రేమగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పాటలోని సాహిత్యం, విజువల్స్‌ కట్టిపడేసేలా ఉన్నాయని ప్రశంసించారు. గోదావరి నేపథ్యంలో అక్కడి అందాలు, ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన అందమైన ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఈదర ప్రసాద్‌, సంగీతం: మార్కండేయ, రచన-దర్శకత్వం: పీఎల్‌ విఘ్నేష్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events