సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రణయగోదారి. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని పీఎల్‌వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సాయికుమార్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారని, ఆయన నటన ప్రధానా కర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. గోదావరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాత తెలిపారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: మార్కండేయ, దర్శకత్వం: పీఎల్ విఘ్నేష్.