మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన తాజా చిత్రం ప్రేమలు. ఇక ఈ సినిమాను తెలుగులో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. మార్చి 08న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తే హైదరాబాద్‍లో జరిగిన ఓ పెళ్లిలో రేణు (మమితా బైజూ)ను చూసి ఇష్టపడతాడు సంతోష్ (నెల్సన్ కే గఫూర్). ఈ విషయాన్ని రైలులో రేణుకు చెప్పేందుకు సచిన్ ప్రయత్నిస్తాడు. అయితే, రేణు నిద్రలో ఆ మాట వినదు. ఈ సీన్‍తో ట్రైలర్ మొదలైంది. రేణును ప్రేమలో పడేసేందుకు హైదరాబాద్‍లోనే గేట్ కోచింగ్ తీసుకునేందు కు సచిన్ డిసైడ్ అవుతాడు. అయితే సంతోష్ రేణును ప్రేమలో పడేశాడా. రేణు సంతోష్‌కు ఒకే చెబుతుందా అనేది తేలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్ రీసెంట్‌గా ఫేమస్ అయిన కుమారి ఆంటీ రిఫరెన్స్ వాడుకున్నారు. ఈ ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా.. పబ్లిసిటీ, పైసలు రెండు ఉంటాయి కానీ ప్రశాంతత ఉండదు అనే ట్రైలర్‌లో ఫన్నీగా సాగింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)