ఉక్రెయిన్‌లో ఈ వారాంతంలో 36 గంటల పాటు కాల్పులు విరమణ పాటించాలని రష్యా అధినేత పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని పేర్కొన్నారు. రష్యాలో ఆర్థోడాక్స్ క్రిస్మస్ సెలవు నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లోని కొందరు ఇదే రోజు క్రిస్మస్ జరుపుకుంటారు. కాగా ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ పునరుద్ఘాటించారు. కానీ చర్చలు జరగాలంటే ఒక షరతు విధించారు. ఉక్రెయిన్ నుంచి తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలను రష్యాకు చెందిన భూభాగాలుగానే జెలెస్కీ ప్రభుత్వం అంగీకరించాలని తేల్చి చెప్పారు. ఈ ఒక్క షరతుకు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌తో చర్చలకు ఎలాంటి అభ్యరంతం లేదని స్పష్టం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)