Skip to main content

Namaste NRI

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ విలువల మార్గదర్శకత్వంలో దేశభక్తి గల యువత వికసిత్ భారత్ నిర్మాణానికి ఉత్సాహంగా కృషి చేయాలని ముర్ము ఆకాంక్షించారు. దీపావళి వేడుకలు రావణుడిపై విజయం సాధించిన అనంతరం భగవాన్ శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన జ్ఞాపకంగా జరుగుతున్నాయని ఆమె సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ రామరాజ్యానికి శుభారంభాన్ని కూడా సూచిస్తోంది అని ఆమె అన్నారు.

దేశంలోని ప్రతి పౌరుడికి మంచి ఆరోగ్యం, సంతోషం, సౌభాగ్యం కలగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. పర్యావరణాన్ని కాపాడుతూ, సామరస్యంతో జీవిద్దాం. భారతీయ విలువల మార్గదర్శకత్వంలో దేశభక్తి గల మన యువత వికసిత్ భారత్ నిర్మాణానికి ఉత్సాహంగా కృషి చేయాలన్నారు. గత సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి పండుగ జరుపుకొంటానని ప్రధాని మోడీ చెప్పారు.దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటానన్నారు. దీపావళి ముందు రోజు దేశమంతా దీపాలతో వెలిగిపోతోందని, ఇది చీకటిపై దేశ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events