అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి నుంచి ఈ శీతాకాలంలో మరణాలు, తీవ్ర అస్వస్థత ఆస్పత్రుల బారినపడే ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకుంటే తక్షణమే బూస్టర్ డోసు తీసుకోవాలన్నారు. అప్పుడే మీకు మరణాలు, తీవ్ర అస్వస్థత ముప్పు తప్పుదుందని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోకుంటే తక్షణమే తొలి డోసు తీసుకోవాలని బైడెన్ కోరారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రజలు వెంటనే బూస్టర్ డోసు తీసుకోవడం కీలకమని స్పష్టం చేశారు.
