కాబుల్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో అమెరికా సైనికులు మరణించారు. మరణించిన 13 మంది సైనికులకు అమెరికా అశ్రునివాళులు అర్పించింది. సైనికుల భౌతిక కాయాలకు అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్, అమెరికా సైనిక ఉన్నతాధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించే సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. సైనిక లాంఛనాలతో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం డోవర్ వైమానిక దళ స్థావరంలో అమరుల కుటుంబాలతో సమావేశమైన జో బైడెన్ దంపతులు వారికి దైర్యం చెప్పారు.