భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమే నేతృత్వంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత దృఢమవ్వాలని ఆకాక్షించారు. భారత్‌లో విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలకు మేం చాలా ప్రాధాన్యమిస్తాం. దేశాధినేతగా మీ నాయకత్వంలో రెండు దేశాల మధ్య రాజకీయ, ఉత్పాదక సహకారం మరింత వృద్ధి చెందుతుందని మేం విశ్వసిస్తున్నాం. పలు రంగాల్లో మన స్నేహపూర్వక దేశాల పరస్పర ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత కోసం మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం అని పుతిన్ పేర్కొన్నారు.














