ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంతర్జాతీయ సినీ వేడుక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలోనూ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రతినిధలతో జెలెన్‌స్కీ చర్చించినట్లు తెలిసింది. ఆదివారం జరిగే ఆస్కార్ పురస్కార ప్రధానోత్సవంలో జెలెన్‌స్కీ ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. అయితే ఆయన ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతారా? లేదా ఆయన రికార్డెడ్ ప్రసంగాన్ని ప్రదర్శించనున్నారా? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే దీనిపై అకాడమీ అధికారికంగా ప్రకటించలేదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సినీ రంగానికి చెందిన వ్యక్తి. పలు కామెడీ షోలు, సినిమాలో నటించిన మెప్పించిన ఆయన 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం సృష్టించారు.