ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. వాషింగ్టన్లో జెలెన్స్కీ పర్యటించనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు వెల్లడిరచారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జెలెన్స్కీ సమావేశం కానున్నారు. అనంతరం కాంగ్రెస్ ఉభయసభల్లో ప్రసంగించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. క్రెమ్లిస్ దాడిలో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. రష్యాను నిలువరించేందుకు అక్కడి సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా మొదటి నుంచి సాయం చేస్తున్న విషయం తెలిసిందే.