Namaste NRI

అధ్యక్ష ఎన్నికలు … తొలి ఫలితం వచ్చేసింది

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ మొదలైన కొన్ని గంటలకే తొలి ఫలితం కూడా వచ్చేసింది. ఓ చిన్న కౌంటీలో ఓటింగ్‌ పూర్తైన వెంటనే ఫలితాన్ని వెల్లడించారు.  న్యూహ్యాంప్‌షైర్‌  రాష్ట్రం లోని డిక్స్‌విల్లే నాచ్‌ లో మొత్తం ఆరుగురు ఓటర్లు ఉన్నారు. అందులో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ‌కు మూడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌  కు మూడు ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌ పూర్తైన 15 నిమిషాల తర్వాత ఫలితాలను వెల్లడించారు. కాగా, 2020లో డిక్స్‌విల్లే నాచ్‌ వాసులు డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కే ఓటు వేశారు. ఆ ఎన్నికల్లో ఆయనే విజయం కూడా సాధించా రు. కాగా, ఎలక్షన్‌ డే రోజున డిక్స్‌విల్లే నాచ్‌లో అర్ధరాత్రి నుంచే పోలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశంలోనే తొలి ఫలితం వెలువడే ప్రదేశంగా ఈ కౌంటీ పేరుగాంచింది.

Social Share Spread Message

Latest News