Namaste NRI

అధ్యక్ష ఎన్నికలు.. తొలి డిబెట్‌తోనే మారుమోగిన వివేక్ రామస్వామి పేరు

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీపడే అభ్యర్థుల కోసం తీవ్ర పోటీ నెలకుంది. మొత్తం ఆ పార్టీ నుంచి 8 మంది పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు.  అధ్యక్ష అభ్యర్థిలో వివేక్ రామస్వామి తమ ప్రాబల్యం చాటుకుంటున్నారు. ఈ కీలక పదవికి పోటీలో తొలి ప్రైమరీ చర్చలో ఈ ఇండో అమెరికన్ మల్టీమిలియనీరు అయిన బయోటెక్ అధినేత రామస్వామి ఆకర్షణీయ రీతిలో రేస్‌లో ముందుకు వచ్చారు. తరువాత జరిగిన ఆన్‌లైన్ ఫండ్‌రైజింగ్‌లో ఆయన 4,50,00కు పైగా డాలర్ల నిధిని సమీకరించారు. 38 సంవత్సరాల రామస్వామి డిబేట్ తరువాత గంట వ్యవధిలోనే ఇంత భారీ మొత్తం పార్టీకి విరాళంగా పోగుచేయగలిగారు. ఇప్పుడు ఆయన సాధించిన ఫండ్ సగటున చూస్తే మొత్తం ఓటర్ల శాతంలో 38 డాలర్లుగా నిలిచింది.

ఇప్పుడు ఈ పారిశ్రామికవేత్తకు రాజకీయంగా ముగ్గురు సొంతపార్టీ ప్రత్యర్థులు న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టియిస్, మాజీ ఉపాధ్యక్షులు మైక్ పెన్స్, సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ నుంచి తీవ్రస్థాయి పోటీ ఉంది. ఈ దశలో జిఒపి డిబేట్‌లో రామస్వామి తన స్థానం పదిలపర్చుకున్నారని పాపులర్ యాక్సిస్ విశ్లేషించింది. తొలి డిబేట్‌లో ఆయన సమాధానాల తీరు పట్ల మొత్తం మీద 28 శాతం బాగుందనే స్పందించారు.  ఎన్నికల ఫలితాల తారుమారు కేసు, ఇప్పుడు అరెస్టుతో మాజీ అధ్యక్షులు ట్రంప్ ఈ రేస్‌కు తాత్కాలికంగా దూరమయ్యారు. తొలి చర్చలో ట్రంప్‌ గైర్హాజరీ కావడంతో వివేక్‌ కీలకంగా నిలిచారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events