ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో నిర్బంధంగా రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు ఇప్పటికీ ఉపశమనం దొరకడం లేదు. ప్రధాని మోదీ ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన చర్చల్లో, బలవంతంగా రష్యన్ సైన్యంలో చేరిన భారతీయులను విడుదల చేయాలని పుతిన్‌ను కోరినట్లు, అందుకు ఆయన అంగీకరించినట్లు తెలిసిందే. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారలేదు. పంజాబ్‌కు చెందిన గగన్ దీప్ అనే వ్యక్తి ఉన్న యూనిట్‌ను ఉక్రెయిన్‌తో యుద్ధం లో ఫ్రంట్ లైన్‌లో పోరాటానికి వెళ్లాలని రష్యన్ ఆర్మీ కమాండర్ ఆదేశించారు.