అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలన్నీ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగానే ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. ట్రంప్ మెజారిటీ మార్క్ 270 ఓట్లను సాధించారు. దీంతో ట్రంప్‌నకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. చరిత్రాత్మక విజయం పొందిన నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ మునుపటి పదవీకాల విజయాలకు అనుగుణంగా, భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మన సంబంధాలకు పునరుజ్జీవం కల్పించడానికి నేను ఎదురుచూస్తున్నాను. ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు, ప్రపంచ శాంతి, సుస్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం అని మోదీ తెలిపారు.