
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ను ఎగుర వేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేశారు. వరుసగా 11వ సారి ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం హెలీకాపర్ల ద్వారా పూలవర్షం కురిపిం చాయి. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇక ఈ సారి వికసిత భారత్ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్నది. వేడుకలకు దాదాపు 6వేల మంది ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఎర్రకోట పరిసరాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
