శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారత నిర్మాణం అవుతుందని చెప్పారు. 75వ స్వాతంత్య్ర అమృత ఉత్సవాల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని ఎగురవేశారు. తొలుత ఎర్రకోట వద్దకు చేరుకున్న మోదీ త్రివిధ దళాల నుంచి గౌరవం వందనం స్వీకరించారు. ఎర్రకోటకు చేరుకునే ముందు రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద జాతీయ పతకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.