భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ వెల్లడిరచింది. 71 శాతం మంది సానుకూలంగానూ, 21 శాతం మంది వ్యతిరేకంగానూ స్పందించడంతో ఆయనకు నెట్ అఫ్రూవల్ రేటింగ్ 50 శాతం ఉందని తెలిపింది. ప్రపంచ నేతలకు కల ప్రజాదరణను మార్నింగ్ కన్సల్ట్ పరిశీలించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నేతల అఫ్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అఫ్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది.
బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రజాదరణ దారుణంగా తగ్గిపోయింది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన ట్రుడు, బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ ఇన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్‌లకు నెట్ నెగిటవ్ అప్రూవల్ రేటింగ్స్ వచ్చాయి. అమెరికాలో సగటున రోజుకు 45 వేల మంది నుంచి అభిప్రాయలు సేకరించగా, మిగతా దేశాల్లో సగటున 3000`5000 మందిని సర్వే చేశారు.