Namaste NRI

గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రారంభించిన ప్రధాని

 భారత్‌ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20  శిఖరాగ్ర సమావేశంలో తొలి రోజు కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుస్థిరత, క్లీన్ ఎనర్జీ అన్వేషణలో ఒక కీలక ఘట్టమని తెలిపారు. ఈ కూటమిలో చేరిన సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు దేశాల అధినేతలతో  మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌, ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలపై చర్చించారు. కాగా, దీనికి ముందు భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా మెరుగుపరిచేందుకు కనెక్టివిటీ కారిడార్‌ను జీ20 దేశాల అధినేతలు ప్రారంభించారు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణకు ఈ కారిడార్‌ కనెక్టివిటీ దోహదపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది చారిత్రక ఒప్పందమని కొనియాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events