Namaste NRI

జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలో ఇరుదేశాధినేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా భారత్‌, అమెరికా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా యుద్దాన్ని నిలిపివేసేందుకు అమెరికా, భారత్‌ తమ సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంటాయన్నారు. భారత్‌, అమెరికా లక్ష్యాల్లో సారూప్యత ఉందని తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌లో బలమైన బంధం ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు భారత్‌ ప్రకటించిన మానవతా మద్దతును స్వాగతించారు. నిరంతర సంప్రదింపుల ద్వారా భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేస్తామన్నారు.

                 ఉక్రెయిన్‌లో మారణకాండను ఖండిస్తున్నట్లు మోదీ తెలిపారు. చర్యల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని జెలెన్‌స్కీ, పుతిన్‌ను కోరినట్టు తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ద పరిస్థితుల నేపథ్యంలో జెలెన్‌స్కీ, పుతిన్‌తో మాట్లాడి సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయగలిగామని తెలిపారు. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ అంశం గురించి భారత పార్లమెంట్‌లోనూ చర్చించామన్నారు. యుద్ద భూమి నుంచి భారతీయులను సురక్షింతగా తరలించినట్లు తెలిపారు. కీలక సమయంలో జో బైడెన్‌తో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఉక్రెయిన్‌కు భారత్‌ అదనంగా ఔషధాలు పంపుతుందని హామీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events