శంషాబాద్ సమీపంలోని ముచ్చింత్‌లో గల రామానుజ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సమతామూర్తి కేంద్రంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి, మైం హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు కంటే ముందు 108 దివ్య దేశాల (వైష్టవ ఆలయాలు)ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా మోదీకి చినజీయర్ స్వామి దేశాల విశిష్టతను వివరించారు.