Namaste NRI

ర‌ష్యాలో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ  వ‌చ్చేనెలలో ర‌ష్యాలో ప‌ర్య‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. క్రెమ్లిన్‌కు చెందిన అధికారి ఒక‌రు ఈ విష‌యాన్ని ద్రువీక‌రించిన‌ట్లు తెలిసింది. జూలైలో మోదీ రష్యాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు దౌత్య‌వ‌ర్గాల ద్వారా వెల్లడైంది. ర‌ష్యాలో విజిట్ చేసేందుకు మోదీకి ఓపెన్ ఇన్విటేష‌న్ ఉన్న‌ట్లు ఇటీవ‌ల క్రెమ్లిన్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మోదీ క‌లుసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

మాస్కోలో పుతిన్‌ను మోదీ క‌లుస్తార‌ని తాజాగా రిలీజైన ప్రెస్ రిలీజ్ ద్వారా తెలుస్తోంది. అయితే వీరి భేటీకి చెందిన క‌చ్చిత‌మైన తేదీని ఇంకా వెల్ల‌డించ‌లేదు. కానీ జూలై 8వ తేదీన ఈ భేటీ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. పుతిన్ విదేశాంగ వ్య‌వ‌హారాల ప్ర‌తినిధి యూరి ఉషోకోవ్ మాత్రం దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ ఏడాది బ్రిక్స్ నేత‌ల స‌మావేశాల్లోనూ ఇద్ద‌రూ క‌లుసుకోనున్న‌ట్లు భావిస్తున్నారు. క‌చ‌న్ న‌గ‌రంలో ఈ స‌మ్మిట్ జ‌ర‌గ‌నున్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events