ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు గతంలో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్‌లో గతంలో కొనుగోలు చేసిన భూమిని విరాళంగా ఇచ్చేశారు మోదీ. బాండ్స్, షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టలేదు. సొంతంగా కారు కూడా లేదు. అయితే సుమారు రూ.1.73 లక్షల విలువైన మూడు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఏడాది క్రితం 2021, మార్చి 31 నాటికి 26.13 లక్షలుగా ఉండేవి. రూ.1.1 కోట్లు విలువైన స్థిరాస్తి ఉంటే దానిని విరాళంగా ఇచ్చారు. 2022, మార్చి 31 నాటి డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం మోదీ వద్ద ఆస్తులు రూ.2,23,82,504 ఉన్నాయి. 2022, మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,360 నగదు ఉంది. అలాగే పోస్ట్‌ఆఫీస్‌లోని నేషనల్ సేవింగ్స్ సర్టిపెక్ట్ విలువ రూ.9,05,105, జీవిత బీమా పాలసీల విలువ రూ.1,89,305గా ఉన్నాయి.