ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అబుదాబికి చేరుకున్నారు. అధ్యక్ష భవనంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. అయితే స్థానికంగా సేంద్రీయ పద్ధతిలో పండిరచిన కూరగాయలతో పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారు చేసిన విందును ప్రధానికి వడ్డించారు. గోధమలు (హరీస్), ఖర్జూర సలాడ్‌లతో పాటుగా మసాలా సాస్, కాల్చిన కూరగాయలను స్టార్టప్‌లుగా అందించారు. ఈ విందుకు విచ్చేసిన ప్రముఖులకు క్యాలీఫ్లవర్, క్యారెట్ తందూరి, నల్ల పప్పు, హరీస్‌లను ప్రధానంగా వడ్డించారు. వీటితో పాటు స్థానికంగా పండిరచిన పండ్లను కూడా అందించారు. ఈ వంటకాల్లో వాడిన నూనె కూడా కూరగాయలతో తయారు చేసిందేనట. ఈ విందులో పాలు, గుడ్డుతో తయారు చేసిన పదార్ధం లేదని తెలుస్తోంది.
