Skip to main content

Namaste NRI

ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ లో భద్రతా దళాలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు

ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. జవాన్లతో తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ క్యాంపు లో మాట్లాడుతూ దేశ అంతర్గత శత్రువుల వల్ల ఎప్పుడూ ప్రమాదమే అని వారి పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉగ్రవాదం, నక్సలిజం వల్ల చాలా మంది జవానులు అమరులయ్యరని పేర్కొన్నారు. మావోయిస్టు తీవ్రవాదం పై దశాబ్దాలుగా సాగిన పోరాటంలో విజయం సాధించినందుకు ఈ దీపావళి వేడుకలు చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, భద్రతా దళాల త్యాగాలు, అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైనదని కొనియాడారు. మావోయిస్టుల పై దశాబ్దాలుగా సాగిన పోరాటంలో దేశం సంపూర్ణ విజయం సాధించిన తొలి దీపావళి ఇది. ఇది మనం సాధించిన అసాధారణ విజయం. నక్సలిజం పూర్తిగా అంతమవ్వడంతో ఇప్పుడు దేశంలోని ప్రతి జిల్లా తిరుగుబాటు నుండి విముక్తి పొందింది. ప్రజలు ధైర్యంగా బయటకు రాగలుగుతున్నారు. ఇదంతా ధైర్యవంతులైన లక్షలాదిమంది సైనికులు చేసిన పోరాట ఫలితమే. అందుకే నేను ఈరోజు మీతో కలిసి దీపావళి జరుపుకొడానికి వచ్చాను అని ప్రధాని మోదీ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events