భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ ప్రకటించింది. జో బైడెన్‌తో భేటీకి ముందు వైట్‌హౌస్‌లోనే క్వాడ్ నేతలతో ప్రధాని సమావేశం కానున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలు, ఇండో పసిఫిక్ సంబంధాలు, కరోనా మహమ్మారి, పర్యావరణ మార్పులు తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఈ నెల 23న జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో విడివిడిగా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. గత జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి.