Skip to main content

Namaste NRI

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం 76వ సంవ్సతరంలోకి అడుగుపెట్టారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అని అభివర్ణిస్తున్నారు. పలువురు ప్రపంచ నాయకులు కూడా మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను నూతన భారతదేశం రూపశిల్పి అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హోంమంత్రి అమిత్ తోపాటు పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నాయకత్వాన్ని, ప్రజా సేవ పట్ల నిబద్ధతను, దేశాభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధాని మోడీ సుపరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడంతో పాటు, సమ్మిళిత అభివృద్ధికి అపూర్వమైన ఊపును, కొత్త దిశను అందించారని రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక కొత్త గుర్తింపును సృష్టిస్తోందని పేర్కొంటూ, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా మోదీ నాయకత్వం చారిత్రాత్మకమైనదని, పరివర్తనాత్మక ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను నడిపించడం నుండి విప్లవాత్మక ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించడం వరకు, 25 సంవత్సరాల ఆదర్శప్రాయమైన ప్రజాసేవను పూర్తి చేసి భారతదేశ వృద్ధికి కొత్త ఊపునిచ్చారని తెలిపారు. సేవ, సంకల్పం, సుశాసన్ అనే ఆయన దార్శనికత దేశంలో 140 కోట్ల మంది పౌరులకు స్ఫూర్తినిస్తోందని పేర్కొంటూ, మోదీకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. దేశంలో హైవేలు, రైల్వేల ఆధునీకరణతో పాటు అత్యాధునిక వందే భారత్ రైళ్ల ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాని మోదీ దేశ రవాణా ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చివేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేయడంలో మోదీ పోషించిన పాత్రను పుతిన్ కొనియాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events