ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నా చిత్రమిది. ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సలార్‌లోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రకి సంబంధించిన పలు విషయాల్ని వెల్లడిరచాయి సినీవర్గాలు.
వరదరాజ్ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ప్రభాస్ పృథ్వీరాజ్ మధ్య గొప్ప డ్రామాని చూస్తాం. సినిమాలో ఇద్దరి పాత్రలు ధీటుగా ఉంటాయి. వరదరాజ్ మన్నార్‌గా పృథ్వీరాజ్ కంటే మరెవ్వరూ గొప్పగా నటించలేరు. ఈ ఇద్దరితో కలిసి ప్రయాణం చేయడం ఓ గొప్ప అనుభవం అన్నారు. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)