Skip to main content

Namaste NRI

ఇరుముడిలో కావేరిగా ప్రియా భవానీ శంకర్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

రవితేజ హీరోగా రూపొందుతున్న ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రియా భవానీశంకర్‌ ఫస్ట్‌లుక్‌ ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె కావేరి అనే పాత్రను పోషిస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఫస్ట్‌లుక్‌లో ప్రియా భవానీశంకర్‌ బుగ్గపై హీరో రవితేజ ముద్దుపెడుతూ కనిపించగా, ఆమె సహజమైన ఆహార్యంతో అందంగా నవ్వుతూవుంది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఈ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్నది. నేపథ్యంలో ఉన్న అరటిపళ్ల బండి, హీరోహీరోయిన్ల ఆహార్యాలను బట్టి ఇది గ్రామీణ నేపథ్యంతో కూడిన సినిమా అని తెలుస్తున్నది. ఎమోషన్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కూడిన పవర్‌ఫుల్‌ కథ ఇదని, తండ్రీకూతుళ్ల అనుబంధం ఈ కథకు హైలైట్‌ అని మేకర్స్‌ చెబుతున్నారు. రవితేజ కూతురుగా బేబీ నక్షత్ర నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News