గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా ఆమె నటించిన ప్రతిష్టాత్మక చిత్రం మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్ ఈనెల 22న అమెరికాలో విడుదల కానుంది. సైంటిఫిక్ క్లాసిక్ మ్యాట్రిక్స్ సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్‌స్కేర్ వద్ద నిర్వహించిన ప్రమోషన్‌లో ప్రియాంకచోప్రాకు సంబంధించిన భారీ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఇందులో ఆమె వినూత్నమైన ఆహార్యంతో చూపరులను ఆకట్టుకుంది. ప్రియాంక పాత్ర ఏమిటన్నది ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చిత్రణ అత్యంత శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు. టైమ్ స్కేర్ వద్ద ప్రియాంక చోప్రా పోస్టర్‌ను వీక్షించిన చాలా మంది ఇండియన్స్ భారతీయ వనిత పేరు ప్రఖ్యాతుల్ని ఆమె ఘనంగా చాటారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
