
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 4.1 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సోదరుడు రాహుల్‌గాంధీ వయనాడ్‌లో సాధించిన మెజార్టీ మార్క్‌ను ఆమె తిరగరాశారు. వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ 6,22,338 ఓట్లు సాధించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి 3,64,422 ఓట్ల మెజార్టీ రాగా, ఈసారి ప్రియాంక గాంధీ 4,10,931కి మెజార్టీ అందుకోవటం గమనార్హం.
