సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు ”తందనానా – 2025”లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు సచివాలయంలోని 5వ బ్లాకులో సీఎం నేడు బంగారు పతకాలను బహుకరించారు. సబ్ జూనియర్ విభాగంలో భట్టిప్రోలు మేఘన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీమహాలక్ష్మి, సీనియర్ విభాగంలో సముద్రాల లక్ష్మీ హరిచందన సీఎం చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నారు.




















