Namaste NRI

డొమెనికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం కేసులో పురోగతి

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) డొమెనికన్‌ రిపబ్లిక్‌ లోని ఓ రిసార్టులో బీచ్‌ వద్ద అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమె కోసం వారం రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆమె జాడ కానరాలేదు. ఈ క్రమంలో చివరిసారిగా సుదీక్ష కనిపించిన పుంటా కానా బీచ్‌ వద్ద ఆమెకు చెందినదిగా భావిస్తున్న దుస్తులను అధికారులు గుర్తించారు.

బీచ్‌ వద్ద ఉన్న లాంజ్ చైర్‌పై తెల్లటి నెటెడ్‌ సరోంగ్‌, లేత గోధుమ రంగు ఫ్లిప్‌-ఫ్లాప్‌ (పాదరక్షలు)ను అధికారులు గుర్తించారు. సుదీక్ష కోణంకి అదృశ్యమైన రాత్రి కనిపించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆమె చివరిసారిగా ధరించిన దుస్తులను పోలీ ఉన్నట్లుగా ఇవి ఉన్నాయి. ఆ దుస్తులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఎలాంటి ట్యాంపరింగ్ సంకేతాలు కనిపించడం లేదు. సముద్రంలోకి వెళ్లేముందు తన వస్తువులను లాంజ్‌ చైర్‌పై వదిలేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]