Namaste NRI

సైకో పోవాలి.. బాబు రావాలి :టీడీపీ ఎన్‌ఆర్‌ఐల నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా లండన్‌లో టీడీపీ ఎన్‌ఆర్‌ఐలు నిరసన వ్యక్తం చేశారు. జగన్‌ ప్రస్తుతం లండన్‌లో బస చేసిన ప్రాంతానికి సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. మంచోడు జైల్లో పిచ్చోడు లండన్‌ లో అక్రమ అరెస్ట్‌ను ఖండిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం  సైకో పోవాలి.. బాబు రావాలి అని నినాదాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించారు.  ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో స్వాతిరెడ్డి, ఇతర కార్యకర్తలు నిరసన తెలిపారు. బ్రిటన్‌లోని ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో పార్లమెంటు ఎదుట ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమన్నారు.

Social Share Spread Message

Latest News