బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, దివ్య పిైళ్లె ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. మరోవైపు మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా వేగవంతం చేశారు. రీసెంట్‌గా విడుదల చేసిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, అదితి శంకర్‌ల ఫస్ట్‌లుక్ పోస్టర్లు సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి.

శుక్రవారం పూర్ణిమగా దివ్య పిైళ్లె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సంప్రదాయ చీరకట్టులో బంగారుబొమ్మలా దివ్య పిైళ్లె మెరిసిపోతున్నారు. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సమర్పణ: డా.జయంతిలాల్ గడ.
