Namaste NRI

అందరికీ నచ్చే సినిమా పురుష : వీరు వులవల

పవన్‌కల్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న కమర్షియల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ పురుషః. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్‌ కీలక పాత్రధారులు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు హీరో పవన్‌కల్యాణ్‌ బత్తుల ఆనందం వెలిబుచ్చారు. నిర్మాత, సాంకేతికనిపుణుల సహకారం వల్లే ఈ కథను అనుకున్న విధంగా తీయగలిగానని, హీరో పవన్‌కల్యాణ్‌ బత్తుల అద్భుతంగా నటించాడని, తప్పకుండా తనకు మంచి పేరు వస్తుందని, అందరికీ నచ్చే సినిమా అవుతుందని దర్శకుడు వీరు వులవల చెప్పారు. నటీనటులు సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కమార్‌, హాసిని సుధీర్‌, విషిక కూడా మాట్లాడారు. ఈ నెల 22న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events