Skip to main content

Namaste NRI

క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిన పుష్ప 2

విడుదల ఆలస్యం అవుతున్నాపుష్ప 2  క్రేజ్‌ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. టీజర్‌తోపాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. దేవిశ్రీ సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం, బన్నీ స్టైల్, స్టెప్స్‌, రష్మిక అందచందాలు.. వీటన్నింటికీ అందరూ ఫిదా అయిపోతున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో నిర్మించిన సెట్‌లో ఈ సినిమా పతాక సన్నివేశాలను దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా ఉండనుందని మేకర్స్‌ చెబుతున్నారు. డిసెంబర్‌ 6న విడుదల కానున్న ఈ చిత్రం మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై తెరకెక్కుతున్నది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రానికి నిర్మాతలు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events