ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా కథానాయకుడిగా నటించిన అనువాద చిత్రం పుష్పరాజ్.. ది సోల్జర్. రచిత రామ్, హరిప్రియ కథానాయికలు. ఈ చిత్రాన్ని ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ తెలుగులోకి అనువదించాయి. చేతన్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నికి నిర్మాత బొడ్డు అశోక్. ఈ నెల 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కన్నడలో రూపొందిన భర్జరీకి అనువాదంగా రూపొందిన చిత్రమిది.చిత్ర నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ వాణిజ్యాంశాలతో కూడిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. పుష్పరాజ్ అనే పేరు పెట్టడంతో ఈ సినిమాకి మంచి ప్రచారం లభించింది. పుష్పరాజ్ పోరాటం దేనికోసం అనేది తెరపైనే చూడాలి. నిర్మాతగా నాకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది అన్నారు. ఈ నెల 19న మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నాం అన్నారు.














