ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. భారత్‌లో జరుగనున్న జీ20 సమ్మిట్‌కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు. రష్యా తరుఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని చెప్పారు. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సు, ద్వైపాక్షిక సహకారం, ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై మోదీ, పుతిన్ చర్చించుకున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జీ20 సమ్మిట్ జరుగనున్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వ్యక్తిగతంగా హాజరుకావడం లేదని ఆ దేశం స్పష్టం చేసింది. వర్చువల్‌గా సదస్సులో పాల్గొనవచ్చని తెలిపింది.
