రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు దేశాల పర్యటనలో భాగంగా వియత్నాం చేరుకున్నారు. హనోయిలో ఆయన ఘన స్వాగతం లభించింది. వియత్నాం కన్నా ముందు ఆయన ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. కిమ్ జాంగ్ ఉన్ కూడా చాలా ఘన స్వాగతం అందించారు. హనోయి విమానాశ్రయంలో వియత్నాం డిప్యూటీ ప్రధాని ట్రాన్ హాంగ్ హా పుతిన్‌కు వెల్కమ్ చెప్పారు. వియత్నాంలో పుతిన్ పర్యటన చేపట్టడాన్ని అమెరికా వ్యతిరేకిస్తున్నది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేపట్టిన పుతిన్, మద్దతు కోసం ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నారు. వియత్నాం ప్రధాని టో లామ్ తో పుతిన్ భేటీ అయ్యారు. వ్యవూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడమే తమ ప్రాధాన్యత అని రష్యా పేర్కొన్నది. 2025లో జరగనున్న విక్టరీ డే సంబరాలకు రావాలంటూ టో లామ్‌ను పుతిన్ ఆహ్వానించారు.