Namaste NRI

డోనాల్డ్ ట్రంప్ తో పుతిన్‌  భేటీ  

ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం  ఆయ‌న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో మాట్లాడే అవ‌కాశాలు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ వ‌న్‌లో ట్రంప్ రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ  ఉక్రెయిన్, ర‌ష్యా శాంతి ఒప్పందంపై పుతిన్‌తో మాట్లాడ‌నున్న‌ట్లు చెప్పారు. పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త వారం శాంతి ఒప్పందం కోసం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. భూభాగం అప్ప‌గింత గురించి మాట్లాడుతామ‌న్నారు. ప‌వ‌ర్ ప్లాంట్ల గురించి కూడా చ‌ర్చిస్తామ‌న్నారు.

ఉక్రెయిన్‌తో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పాటించేందుకు పుతిన్‌, ట్రంప్ మాట్లాడుకోనున్న‌ట్లు కొన్ని రోజుల క్రితం అమెరికా దౌత్య‌వేత్త స్టీవ్ విట్‌కాఫ్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]