ప్రధాని మోదీని పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించే అంశంపై ప్రధాని మోదీ వద్ద మంచి ఐడియాలు ఉన్నాయంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉమ్మడి అంగీకారం ద్వారా యుద్ధాన్ని ఆపే ఐడియాలు మోదీ వద్ద ఉన్నట్లు పుతిన్ తెలిపారు. తనతో భేటీ అయిన ప్రతిసారి యుద్ధాన్ని ఆపే అంశం గురించి ఆయన చర్చిస్తుంటారని పుతిన్ పేర్కొన్నారు. వల్దాయి ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ మీటింగ్ సమయంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలను ఆపడంలో మోదీ వ్యూహాం ప్రత్యేకమైందని, ప్రపంచ నేతల్లో ఆయన ఒకరు అని, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, వ్యక్తిగతంగానూ మంచి రిలేషన్ ఉందని, ఎక్కడ కలిసినా ప్రతిసారి ఉక్రెయిన్ యుద్ధం ముగింపు గురించి అడుగుతుంటారని పుతిన్ అన్నారు.

ఉమ్మడిగా అంగీకరం కుదుర్చుకునే ఐడియాలు ఆయన వద్ద చాలా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సమయంలోనూ ఉక్రెయిన్ వార్ గురించి మోదీ అడిగారన్నారు. ఇండియా చేపట్టే శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పిస్కోవ్ తెలిపారు. చర్చలు, దౌత్యంతో ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించాలని భారత్ చేస్తున్న సూచనలను తాము కూడా అంగీకరిస్తున్నట్లు దిమిత్రీ వెల్లడించారు.















