ఉక్రెయిన్ అక్రమణే లక్ష్యంగా రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంతో పుతిన్ పెద్ద విజయమే సాధించారు. ఉక్రెయిన్ నగరం మేరియుపొల్ పూర్తి స్థాయిలో రష్యా సైన్యం పట్టుబిగించింది. అలాగే అక్కడి అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్ మినహా ఉక్రెయిన్ ఓడరేవు నగరాన్ని రష్యా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ ఉక్రెయిన్ నుంచి మరియుపోల్‌కు విముక్తి లభించిందన్నారు. మరియుపోల్‌ను ఆక్రమించడం రష్యా దళాల పోరాటానికి విజయమని పుతిన్ అభివర్ణించారు. అజోవ్ సముద్రంలోని మరియుపోల్‌పై పూర్తి నియంత్రణ సాధించడం రష్యాకు వ్యూహాత్మక విజయం. ఇది తూర్పు ఉక్రెయిన్‌లోని రస్యా అనుకూల వేర్పాటువాదుల భూభాగాలకు విలీనమైన క్రిమియాను అనుసంధానించడంలో సహాయపడుతుంది.