రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు నాటో దళాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే నాటో దేశాలు పంపిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌తో రష్యా భూభాగంపై జరుగుతున్న దాడులు పెరిగాయి. దీన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకించారు. పాశ్చాత్య దేశాల ఆయుధాలు వాడడం అంటే, నేరుగా నాటో దేశాల తో యుద్ధం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. అంటే రష్యాతో అమెరికా, దాని మిత్రదేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లు అవుతుందని పుతిన్ తెలిపారు. ఒవకేళ ఆ దేశాలు అలాగే తమ వెపన్స్‌తో దాడి చేస్తే, అప్పుడు స్పందన కూడా ఆ రేంజ్‌లో ఉంటుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణులను వాడడం అంటే నేరుగా ఉక్రెయిన్ సంక్షోభంలో తలదూర్చడమే అవుతుందని పుతిన్ తెలిపారు.