పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ దేశాలను టార్గెట్ చేయాలనుకుంటున్న దేశాలకు ఆయుధాలు సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న అమెరికాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై దాడికి ఆయుధాలు ఇవ్వడం వల్ల సమస్యలు తీవ్రతరం అవుతాయన్నారు. వార్ జోన్‌కు ఆయుధాలు పంపడం వీలవుతుందని అనుకునప్పుడు, అలాగే తాము కూడా సున్నితమైన దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తామని పుతిన్ అన్నారు.
పశ్చిమ దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తే, ఆ దేశాలను టార్గెట్ చేయాలనుకుంటున్న ఇతర దేశాలకు తాము కూడా ఆయుధాలను ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే ఏ దేశాలకు ఆయుధాలను ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. జర్మనీ తయారు చేసిన లాంగ్ రేంజ్ ఆయుధాలతో ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతోందని, రష్యాపై దాడికి మిస్సైళ్లు పంపడం వల్ల, రష్యా-జర్మనీ మధ్య సంబంధాలను బలహీనపరుస్తుందని పుతిన్ పేర్కొన్నారు.